గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు తీరని అన్యాయం చేసే జీవో నెంబర్ 29 ని తక్షణమే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు తీరని అన్యాయం చేసే జీవో నెంబర్ 29 ని తక్షణమే రద్దు చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీఆర్‌ఎస్ నాయకుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగులో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్-1 ఓపెన్ కేటగిరి పోస్టులకు 1:50 నిష్పత్తిలో ఎంపిక అభ్యర్థుల జాబితాలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల వర్గాలకు చెందినవారు ఉన్నారో ప్రభుత్వం బయటపెట్టాలని కోరారు.
గ్రూప్-1 ఓపెన్ కేటగిరి పోస్టులకు రిజర్వేషన్ పాటించకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 55 నిబంధనల మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పొందుపరిచిన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 46 అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ప్రవీన్ కుమార్ డిమాండ్ చేశారు.