కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విద్యా కళాశాలను పునర్ధించకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ చెప్పి కాలయాపన చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతామని చెప్పింది. ఈ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ పార్టీ స్వాగతిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ హాయంలో హైదరాబాద్‌లోని దోమలగూడలో ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విద్యా కళాశాలను పునర్ధించకుండా స్పోర్ట్స్ యూనివర్సిటీ చెప్పి కాలయాపన చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యాశాఖ, క్రీడా శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, బీఆర్ఎస్ హయాంలోనే దోమలగూడలో వ్యాయామ విద్యా కళాశాలను స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలని అనుకున్నామని తెలిపారు. తొలి విడతగా పక్కా భవనాల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీకి అప్పటి సీఎం కేసీఆర్ రూ. 20 కోట్లు కేటాయించారని ఆయన తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం కార్యాలయానికి లేఖ రాసినా స్పందన లేదన్నారు. దోమలగూడలో ఉన్న వ్యాయామ విద్యా కళాశాలలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోమలగూడ వ్యాయమ విద్యా కళాశాలపై వివక్ష చూపవద్దని కోరారు. రాష్ట్రంలో వ్యాయామ విద్యా కళాశాల ఉన్నది దోమలగూడలోనే అని, స్పోర్ట్స్ యూనివర్సిటీపై ప్రభుత్వం పెద్ద, పెద్ద మాటలు చెప్తుందని శ్రీధార్ రెడ్డి పేర్కొన్నారు.