Prashanth Vemula: కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోయాయ్.. బండి సంజయ్.. తొండి సంజయ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.


Published Aug 27, 2024 06:57:05 AM
postImages/2024-08-27/1724757751_vpreddy.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కాం గురించి మాట్లాడని బండి సంజయ్, ఇప్పుడు కవితకి బెయిల్ రాగానే మాట్లాడుతున్నారని విమర్శించారు. వాల్మీకి స్కాం గురించి అన్ని ఆధారాలు ఉన్నాయి కదా మరి ఎందుకు మాట్లాడం లేదు బండి సంజయ్‌ని ఆయన ప్రశ్నించారు. కలిసిపోయింది కాంగ్రెస్, బీజేపీ అని, మీ రెండు పార్టీలు ఒక్కటయి అందరిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మాట్లాడిన మాటలు మర్చిపోయారు అని అన్నారు. కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ప్రశాంత్ రెడ్డి సూచించారు. 

పీసీసీ రేస్‌లో నేనే ముందు ఉండాలని, కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించకుండా నోటికి ఇష్టం వాచినట్టు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అప్ పార్టీతో కూటమిలో ఉన్నారు కదా, మనీష్ సిసోడియాకి బెయిల్ రావడానికి ఎంత మంది బీజేపీ వాళ్ళ ఇండ్లకు తిరిగారని ఆయన మహేష్ కుమార్‌ని ప్రశ్నించారు. రాష్ట్రంలో సివిల్ సప్లైస్ స్కాం జరిగిన కనీసం స్పందించని బండి సంజయ్.. కరీంనగర్ నియోజకవర్గంలో అమృత్ అనే వాటర్ సప్లై స్కీం ఉంది దానికి రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డి కాంట్రాక్టర్ అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. అమృత్ స్కీం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకం, ఆ పథకాన్ని సీఎం బావమర్ది చేస్తున్నాడు అంటే కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు కలిసిపోయారు అని అర్థం అవుతుందని ఎమ్మెల్యే గంగుల పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana supremecourt brs mlc-kavitha delhi-liquor-policy-case bail-petition

Related Articles