BRS: కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు, అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు. 


Published Jun 26, 2024 10:33:10 AM
postImages/2024-06-26/1719415925_brschiefkcr.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు, అభిమానుల సందర్శన గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. తమ అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవెల్లి నివాసానికి తరలి వస్తున్నారు. వచ్చిన ప్రతి కార్యకర్తను, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ప్రత్యేక సమయాన్ని కేసీఆర్ కేటాయిస్తున్నారు. బుధవారం నాడు జనసందోహంతో ఎర్రవెల్లి పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలు మారుమోగాయి. కార్యకర్తలతో పాటు పలు నియోజక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎంఎల్సీలు, మాజీ చైర్మన్లు తదితర ముఖ్యనేతలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధినేతతో నిత్యం సమావేశమౌతున్నారు. ఈ సందర్భంగా బుధవారం పలు నియోజక వర్గాలనుండి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో వారి అభ్యర్థన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఫోటోలు దిగారు. తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ వారి నడుమ మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఓపికతో అధినేత సమయం కేటాయించారు.

పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మర్యాదపూర్వకంగా సమావేశమైన వారిలో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు, బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జమగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ ముఖ్యనేతలు రాగిడి లక్ష్మారెడ్డి, సుధీర్ బాబు, కల్లుగీత కార్పోరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి గౌడ్, మాజీ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రజినీ సాయిచంద్, తదితర నియోజకవర్గాల ముఖ్యనేతలు, ఆయా జిల్లాల స్థానిక నాయకులు ఉన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : kcr telangana mla mlc-

Related Articles