ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులకు సహాయం చేయకుండా బీఆర్‌ఎస్ పార్టీపై బురద వేస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులకు సహాయం చేయకుండా బీఆర్‌ఎస్ పార్టీపై బురద వేస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న తమపై విమర్శలు చేయాడమే రేవంత్ రెడ్డికి పనిగా ఉందని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారని, వాతావరణ శాఖ చెప్పిన కూడా ముందస్తు చర్యలు చేయలేదని వాపోయారు. ముమ్మంటికీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. 16 మంది చనిపోయారని ప్రభుత్యం చెప్తుంది.. తమ కార్యకర్తలు సహాయక చర్యలు చేస్తున్నారని తెలిపారు. ఇంకా 31 మంది చనిపోయారని తమకు సమాచారం వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు ఇస్తే, తొమ్మిది మందిని కూడా కపడలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సర్కార్ బుద్ది తెచ్చుకొని చేసిన తప్పులు సరిదిద్దుకోని ఆపదలో ఉన్న వారిని కాపాడాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు అడిగిన మీరు.. ఇప్పుడు చనిపోయిన వ్యక్తులకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో సహాయం అడిగిన వరద బాధితులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంపై ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రజాపాలన అంటే.. లాఠీ ఛార్జ్ చేయడమేనా అని హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.