Harish Rao: ఇందిరమ్మ రాజ్యంలో మహిళకు గౌరవం లేదా?

మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721043466_hkfries.PNG

న్యూస్ లైన్ డెస్క్: మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని విస్మరించి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్న లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్  వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వ తగిన చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు. 


ఖండించిన కేటీఆర్: 


మాజీ మంత్రి, ఐదు సార్లు సీనియర్ శాసనసభ్యురాలిగా తన హక్కుల కోసం నిరసన తెలపవలసి ఉంటుంది. అయితే ప్రజలచే తిరస్కరించబడిన కాంగ్రెస్ సహచరుడు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నడం ఏమిటి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన అభ్యర్థులు స్టేజ్ పైన ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యే స్టేజ్ కింద ఉండడం ఏంటి అని ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. అఫీషియల్ ప్రోగ్రాంలో ఓడిపోయిన అభ్యర్థులకు పని ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఇలాగే వ్యవహరిస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తక్షనమే ప్రభుత్వం ఈ విషయంపై స్పందించి చర్యలు తీసకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : india-people brs congress ktr harish-rao sabithaindrareddy

Related Articles