తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్: తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండమని కవితకు సూచించారు. ఇటీవలే మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ కవితను కలిసిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి కోర్టు పొడిగించింది. వచ్చే నెల జూలై 5 వరకు కవిత కస్టడీని పొడిగిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. జూన్ 21న ఈడీ అధికారులు ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోమారు జూలై 3న కోర్టు విచారణ జరుపనుంది. అయితే కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.