Harish Rao: వరద బాధితులకు సహాయం చేద్దాం రండి

సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.


Published Sep 04, 2024 08:36:40 AM
postImages/2024-09-04/1725446369_varada.PNG

న్యూస్ లైన్ డెస్క్: సిద్దిపేట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమర్ నాథ్ సేవా సమితి సేవలు దేశ వ్యాప్తంగా వెళ్లాయి అని, వారిని మనస్పూర్తిగా అభినందించారు.  13 సంవత్సరాలుగా మంచు కొండల్లో సేవలు అందిస్తున్నారని, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు నిలయం సిద్దిపేట అన్నారు. ఇపుడు ప్రకృతి కోసం మట్టి వినాయకులు పంచుతున్నారని, ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని సకల కార్యాలకు విగ్నేశ్వరున్ని మొదటగా పూజిస్తామని ఆయన తెలిపారు. ఆకర్షణ కన్నా ఆధ్యాత్మిక ముఖ్యం మట్టి గణపతే మహా గణపతి అని, ప్రకృతి ప్రేమిద్దాం.. మట్టి వినాయకులను పూజిద్దామని పిలుపునిచ్చారు. మానవ సేవయే మాధవ సేవ ఆపదలో ఉన్న వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే.. ఖమ్మంలో వరదలు వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని, అన్ని రకాల వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి అన్నారు. 

సిద్దిపేట నుంచి సేవలు అందించేందుకు చాలా ముందుకు వచ్చారని, సిద్దిపేట నుంచి రేపు 6 లారీల్లో సామాను పంపిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సహాయం చేయడంలో ఇంకా ముందుకు రావాలని, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల జీతం విరాళంగా ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం వరద బాధితుల పట్ల దాతృత్వం వ్యక్తం చేశారని తెలిపారు. ఖమ్మం వరదల కారణంగా చాలా నష్టపోయారని, సిద్దిపేట కౌన్సిలర్ లు కూడా ఒక నెల జీతం ఇవ్వాలని నిర్ణయించిన్నట్లు ఆయన అన్నారు. సిద్దిపేట అమర్ నాథ్ సేవా సమితి, కేదార్ నాథ్ సేవా సమితి, సిద్దిపేట ఐఎంఏ వైద్యులు, తమ వంతు సహకారం అందిస్తామని హరీష్ రావు ప్రకటించారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana mla brs harish-rao brs-cheif khammam-floods

Related Articles