Jagadish Reddy: ఉప ఎన్నికలు ఖాయం.. జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటీష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంపపెట్టు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.


Published Sep 09, 2024 04:02:30 PM
postImages/2024-09-09/1725877950_electionss.PNG

న్యూస్ లైన్ డెస్క్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటీష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంపపెట్టు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త ఫిటీష‌న్‌ల‌పై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామని ఆయన అన్నారు. హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రశ్నించే మరొక అవకాశం ఉప ఎన్నికల రూపంలో ప్రజలకు వస్తుందని అన్నారు. ప్రజాకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిపై అనర్హత వేటు పడటం ఖాయమని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs cm-revanth-reddy congress-government jagadish-reddy telanganahighcourt

Related Articles