కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే అని మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే అని మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందంతో ఆయన మేడిగడ్డను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా.. ప్రభుత్వం నిర్లక్షం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పుడు నీళ్లు ఇస్తే వాళ్ల బాగోతం బయటపడతదనే భయపడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని వాళ్ళు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని పంటలు ఎండపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉందని, గతంలో 28 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడం జరిగిందని ఆయన తెలిపారు. అంత ప్రవాహం ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కుచెదరలేదని గుర్తు చేశారు.
ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందింది. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లే చెపుతున్నారు. ఇప్పుడు కూడా నీళ్లు ఇచ్చేందుకు ఎలాంటి సమస్యలేదంటున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో అబాసుపలువుతామని బయపడుతుందన్నారు. అసలు మనకు నీళ్లొచ్చే కన్నెపల్లి పంప్ హౌజ్ కాలేశ్వరానికి 20 కి.మీ పైన ఉందని అది ఎప్పటికీ లిఫ్ట్ చేస్తనే ఉంటదని తెలిపారు. సుందిళ్ళ, అన్నారంలో కొత్తగా ఏమైనా ఇబ్బందజేలొస్తాయనే ప్రచారంతో తప్పుదోవపట్టించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మనకు నీళ్లిచ్చే కన్నెపల్లి కు ఎత్తిపోయడానికి సంబంధమే లేదన్నారు. సంబంధం లేని సాకులతో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేస్తుందని విమర్శించారు. కాళేశ్వరం పై చేసిన దుష్ప్రచారానికి కాంగ్రెస్ రైతగానికి క్షమాపణ చెప్పి నీళ్లను అందించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.