Kaushik Reddy: కేంద్ర బడ్జెట్‌‌పై ఎంపీలు నిరసన తెలిపాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.


Published Jul 24, 2024 06:36:37 PM
postImages/2024-07-24/1721826397_mlapadi.jfif

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీలో తిరుగుతూ సోషల్ మీడియాలో హెక్టిక్ డే అని పెట్టారని, హెక్టిక్ డే అని తిరుగుతూ కనీసం సెప్టిక్ ట్యాంక్ కట్టే పైసలు కూడా తేలేదని విమర్శించారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ 15 వేల కోట్లు బడ్జెట్లో తీసుకువెళ్లారని, కనీసం తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తేకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా గుండు సున్నా చూపించారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పార్లమెంటు ఎన్నికల్లో చరో 8 గెలుచుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపై వివక్ష చూపిస్తే కనీసం ఖండించకుండా ఏమి చేస్తున్నారని నిలదీశారు. 

పంజాబ్ కు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని వారి ఎంపీలు అక్కడే నిరసన తెలిపారని, తెలంగాణ ఎంపీలు మౌనం ఎందుకు పాటించారన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలన్నారు. బడ్జెట్ విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఖచ్చితంగా కాంగ్రెస్, బీజేపీలను నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా రెండు పార్టీల ఎంపీలు డ్రామాలు ఆపి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ రెండు లక్షలు ఏకకాలంలో చేశామని పేపర్ యాడ్స్ ఇచ్చుకుంటున్న కాంగ్రెస్‌ను నిలదీస్తామన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఎవరికి ఇచ్చారో చూపించాలని, లక్ష రూపాయల రుణమాఫీ లోనే చాలా మందికి రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress bjp parliament centralbudget

Related Articles