Vivekanand: 16 ఎంపీలు ఉన్నా నయా పైసా కూడా తీసుకురాలే

తెలంగాణ ప్రజలను వంచించి 8, 8 ఎంపీల చొప్పున జాతీయ పార్టీలకు ఉన్నా 8 పైసలు కూడా తీసుకురాలేదని మండిపడ్డారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-24/1721819235_kpvivek.PNG

న్యూస్ లైన్ డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా రెండవ రోజు నిర్వహించిన సమావేశంలో కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ చేపట్టిన తీర్మాన చర్చపై ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కేంద్రంలోని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రజలను వంచించి 8, 8 ఎంపీల చొప్పున జాతీయ పార్టీలకు ఉన్నా 8 పైసలు కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ విభజన హామీలను విస్మరిస్తూ తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అయినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మా అధినేత కేసీఆర్ మార్గదర్శకత్వంలో గత పది ఏళ్ల కాలంలో సొంత వనరులను పెంచుకుంటూ దేశ తలసరి ఆదాయాన్ని మించిన అభివృద్ధితో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు. దేశంలోని జనాభాలో 2.5% జనాభాతో రెట్టింపు జిడిపితో పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. దీంతో దేశంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇంతలా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి అభివృద్ధిలో మరింత ఊతమిచ్చేది పోయి తెలంగాణను బీఆర్ఎస్ లేకుండా, కేసీఆర్ లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే కేంద్రం నిధులు కేటాయించకపోవడం దారుణం అన్నారు.


విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారే తప్పా తెలంగాణ గురించి ఏరోజు మాట్లాడలేదన్నారు. ఆర్టికల్ - 3 ప్రకారం చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అనే ధోరణితో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల కాలంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ అనుమతితో కేంద్ర బడ్జెట్ పై తీర్మానం చేస్తామంటూ కొత్త నాటకానికి తెర లేపారని విమర్శించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదని చెబుతూనే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ చేస్తామంటూ చెప్పి కేంద్రంపై నెపం మోపి పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు జూలై 15న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసినపుడే తెలంగాణకు ఎటువంటి ఐఐటీ ఇవ్వలేమని చెబితే నాడు చెలించని సీఎం నిన్న బడ్జెట్ పై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో లోపాయ కారి ఒప్పందం చేసుకొని కుమ్మక్కు రాజకీయాలతో తన కేసుల నుండి బయట పడేందుకు, కుర్చీని కాపాడుకునేందుకు సీఎం రేవంత్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నోరు ఎందుకు మెదపలేదని, సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అంటే వీళ్లు మాట్లాడేది ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట అని అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని తెలంగాణ ప్రజలు సహించారని, తెలంగాణకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వివేకానంద్ స్పష్టం చేశారు.


 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs kpvivekgoud centralbudget

Related Articles