Vivekanand:  కాంగ్రెస్ రైతుల ఆశలను అడియాశలుగా మార్చింది

సాంకేతిక లోపం పేరుతో అందరికీ వర్తింప చేయాల్సిన రుణమాఫీని కొందరికే వర్తింపచేసి మాకు రుణమాఫీ జరుగుతుందనుకున్న రైతుల ఆశలను అడియాశలుగా మార్చిందని విమర్శించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-22/1721642515_mlavp.PNG

న్యూస్ లైన్ డెస్క్: మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.పి వివేకానంద్ కలెక్టర్ గౌతమ్ కుమార్‌ని కలిసి రైతు రుణమాఫీని సాంకేతిక లోపం పేరుతో అందరికీ కాకుండా కొందరికే రుణమాఫీ వర్తింప చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రెండు లక్షల రూపాయల లోపు రుణాలను ఎటువంటి నిబంధనలు లేకుండా మాఫీ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులలో ఆశలను రేకెత్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని నిబంధనలు, సాంకేతిక లోపం పేరుతో అందరికీ వర్తింప చేయాల్సిన రుణమాఫీని కొందరికే వర్తింపచేసి మాకు రుణమాఫీ జరుగుతుందనుకున్న రైతుల ఆశలను అడియాశలుగా మార్చిందని విమర్శించారు. నాట్లు వేసే సమయంలో ఓట్లు లేవని రుణమాఫీని నీరు గార్చాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్లపాటు కేసీఆర్ మార్గదర్శకత్వంలో సంవత్సరంలో రెండుసార్లు రైతుబంధు పేరుతో పంట సహాయాన్ని అందించి వ్యవసాయాన్ని పండుగగా మార్చి గతంలో ఎన్నడూ లేని విధంగా 2014 - 2023 వరకు 300 శాతం అధిక వరి ధాన్య ఉత్పత్తితో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చింది. కానీ నేడు రైతుబంధు పథకంలో లోపాలను ఎత్తిచూపుతో అసెంబ్లీలో చర్చ పెట్టి కొత్త నిబంధనలను చేర్చడం చూస్తుంటే రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతుబంధు పథకంలో మేడ్చల్ జిల్లాకు 39 కోట్లు రావాల్సి ఉండగా 11 కోట్ల చెల్లించి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు. రైతుబంధు పథకానికి రైతు భరోసా పథకంగా మారుస్తూ రైతులకు ఎటువంటి పెట్టుబడి సహాయం అందించకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నిలిచిందన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకొని సాంకేతిక లోపం పేరుతో నిలిచిపోయిన రుణమాఫీని ఎటువంటి నియమ నిబంధనలతో సంబంధం లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీని వర్తింపచేయాలని ఎమ్మెల్యే వివేకానంద్ డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress kpvivekgoud

Related Articles