ఢిల్లీ మద్యం పాలసీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో సాయత్రం 5 గంటలకు తీర్పు వెలువడనుంది.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో సాయత్రం 5 గంటలకు తీర్పు వెలువడనుంది. ట్రయల్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో కవిత తరుపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కవిత బెయిల్ పిటీషన్ పై మే 28న విచారణ జరపగ తీర్పును రిజర్వ్ చేసింది. మార్చి 15న కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత ప్రమేయం ఉందని ఈడీ, సీబీఐ తరుపున న్యాయవాదులు వాదిస్తున్నారు. కాగా, ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పు వెలువరించనుంది.