ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ న్యాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న న్యాయ పోరాటంలో పాల్గొంటాను అని ఆమె అన్నారు. ఏ తప్పు చేయని నేను ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కడిగిన ముత్యంలా భయటకు వస్తాను అని కవిత పేర్కొన్నారు. రెండు జాతీయ పార్టీల కుమ్మక్కై తన మీద తప్పుడు కేసు పెట్టారని కవిత మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితను ఈడీ అధికారులు మార్చ 15ను అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత సీబీఐ అధికారులు కూడా కవితను అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళవారం సుప్రీం కోర్టు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను నిర్దోషిగా పరిగణిస్తూ బెయిల్ మంజారు చేసింది. కవిత దాదాపు 5 నెలన నుంచి జైలులో ఉన్నారు.
Live: BRS Working President @KTRBRS and MLC @RaoKavitha addressing the Media in Hyderabad. https://t.co/p1F2dOtcat — BRS Party (@BRSparty) August 28, 2024