ఢిల్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ఢిల్లీ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ మద్యం కేసులో మంగళవారం సుప్రీం కోర్టు కవితకు బెయిల్ మంజారు చేసింది. అనంతరం ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి నిన్న సాయంత్రం విడుదల అయ్యారు. ఇక అక్కడ బీఆర్‌ఎస్ కార్యలయంలో ఉండి ఇవాళ ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు తదితర నాయకులు కవిత వెంట ఉన్నారు.
ఢిల్లీ మద్యం పాలసి కేసులో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కవితను ఈ ఏడాది మార్చి 25న ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కవిత నివాసంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏఫ్రిల్ 11న సీబీఐ కూడా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో కవిత నిరపరాధి అని సుప్రీంకోర్టు పరిగణిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. pic.twitter.com/nMyWOuduCq — Mission Telangana (@MissionTG) August 28, 2024