BRS: కవితపై కాంగ్రెస్ చేస్తున్న మార్ఫింగ్‌లపై ఫిర్యాదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, మార్ఫింగ్‌లపై బుధవారం బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు.


Published Aug 28, 2024 08:37:46 PM
postImages/2024-08-28/1724857666_compl.PNG

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, మార్ఫింగ్‌లపై బుధవారం బీఆర్ఎస్ జీహెచ్ఎంసీ మహిళా కార్పొరేటర్లు మహిళా కమీషన్ చైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్, బీజేపీ కవితపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు చైర్‌పర్స‌న్‌కు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కార్పొరేటర్ హేమ సామల మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నాయకులు ట్విట్టర్‌లో ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి మహిళా కమిషన్‌కి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని ఆమె తెలిపారు.   
 

newsline-whatsapp-channel
Tags : telangana brs congress mlc-kavitha social-media

Related Articles