రాఖీ పండగను పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్: రాఖీ పండగను పురస్కరించుకొని తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ మహిళా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఈరోజు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మున్సిపల్ మహిళా చైర్మన్లు, కార్పొరేషన్ మహిళా మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, పలువురు పార్టీ కార్యకర్తలు కేటీఆర్‌కి రాఖీలు కట్టారు.
రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాఖీ శుభాకాంక్షలు తెలియజేశారు. మా సోదరీమణి కవిత ఈ రాఖీ పౌర్ణమి పండగ రోజు తనకు రాఖీ కట్టే పరిస్థితి లేకపోవడం బాధాకరం అన్నారు. 155 రోజులుగా కవిత వేదన అనుభవిస్తున్నారో, దానికి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉన్నదన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా పండుగను పురస్కరించుకొని వచ్చి రాఖీ కట్టిన ప్రతి ఒక్క ఆడబిడ్డకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు.