KTR: వాతావరణ శాఖ ముందే చెప్పినా.. మొద్దు నిద్రలో సర్కార్

హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, కనుక ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు


Published Sep 02, 2024 08:17:11 PM
postImages/2024-09-02/1725288431_heartktr.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం 27 ఆగస్టు నాడు పలు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని, కనుక ప్రభుత్వం అలెర్ట్‌గా ఉండాలని తెలియజేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. కానీ, రాష్ట్రంలోని కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదని మండిపడ్డారు. ఎలాంటి ముందుజాగ్రత్తలు లేవు, స్థానిక ప్రజలకు హెచ్చరికలూ లేవు అన్నారు. 

రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు.. మరొక మంత్రి ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు.. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడని కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శాలు చేశారు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని, వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs ktr cm-revanth-reddy congress-government meet heavy-rains

Related Articles