రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఇవాళ నిరుపేదల ఇళ్లను కూల్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
న్యూస్ లైన్ డెస్క్: రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా పేరుతో ఇవాళ నిరుపేదల ఇళ్లను కూల్చిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జోరు వానలో కనికరం లేని సర్కారు కర్కశంగా గూడు కూల్చేస్తే దిక్కుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో అభాగ్యులు తలదాచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అమాయకులైన పేదవారి ఇండ్లు కూల్చడం తప్ప బడ బాపుల ఇండ్లు కూల్చడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన సుమారు 40,000 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు హైదరాబాద్‌లో పేదలకు కేటాయింపులకు అందుబాటులో ఉన్నాయి అని అన్నారు. ఇలాంటి బాధాకరమైన చిత్రాలను మనం చూడనవసరం రాదని కాబట్టి వెంటనే డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని సీఎస్ శాంతి కుమారిని కోరారు. మానవీయ పునరావాస విధానంతో ముందుకు రావాలని, పౌరులందరికీ చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ సూచించారు.