KTR: నీళ్లు వృథా పోకుండా చూడండి

కరీంనగర్ నగర శివారులోని లోయర్ మానేరు డ్యామ్ ను బీఆర్ఎస్ నాయకుల బృందం సందర్శించారు.


Published Jul 25, 2024 07:00:23 PM
postImages/2024-07-25/1721914223_kale22.PNG

న్యూస్ లైన్ డెస్క్: కరీంనగర్ నగర శివారులోని లోయర్ మానేరు డ్యామ్ ను బీఆర్ఎస్ నాయకుల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. నీళ్లు వృథా పోకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిజర్వాయర్లో నింపి పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు రాక కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందకి వృధాగా పోతున్నాయని ఇంజనీర్లు చెప్తున్నారు.   

ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి నీళ్లు అన్ని కిందకి వృధా పోనియాకుండా కాళేశ్వరంలో కట్టుకున్న పంప్ హౌస్లు నింపాలని కోరారు. మనం కట్టిన కాళేశ్వరం రిజర్వాయర్లో 240 టీఎంసీల నీళ్లు నింపుకోవచ్చు అంటే 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చు అని కేటీఆర్ కేటీఆర్ అన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people mla brs ktr kaleshwaram-projcet

Related Articles