వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, నాయకులు ఎద్దును అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడిన ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
న్యూస్ లైన్, ఏపీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి తృట్టిలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో జరిగిన పోలేరమ్మ కొలుపులకు మంత్రి డోలా హాజరయ్యారు. అక్కడ అమ్మవారికి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఎడ్లబండ్ల ముందు ఫోటోలకు దిగే సమయంలో ఎద్దు బెదిరిపోయి మంత్రి డొల్లాను వీరాంజనేయస్వామిని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో మంత్రి కొద్దిదూరంలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, నాయకులు ఎద్దును అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్వల్పంగా గాయపడిన ఆయనను వెంటనే హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎడ్లబండి ముందు నిలబడిన మంత్రి డోలాతో ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మరోవైపు అక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఏర్పాటు చేసిన డీజే సౌండ్ ఎక్కసారిగా పెంచడంతో ఎడ్లు బెదిరిపోయాయి. దీంతో దాని ముందు ఉన్నవాళ్లను గుద్దుతూ ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి డోలాను ఢీ కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో మంత్రిపై ఎద్దు దాడి.. pic.twitter.com/s7M2Ff71dZ — News Line Telugu (@NewsLineTelugu) July 29, 2024