రోజురోజుకు బస్సుల కొరతతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డారు
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. సరైన సమయంలో బస్సులు రాక నానా గోస పడుతున్నారు. అలాగే ప్రభుత్వం అదనపు బస్సులు ప్రారంభించ కపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదివారం ఎంజీబీఎస్ బస్టాండ్‌లో హైదరాబాద్ నుంచి రాయచూర్ వెళ్లే బస్సులు కరువు అయ్యే. బస్సు కోసం రెండు గంటల నుంచి ప్రయాణికులు వేచి చూశారు. కాగా, అంతసేపైన కూడా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రయాణికులు విసుగు చెందారు.
కొన్ని గంటల తర్వాత బస్సు రాగానే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సీటు కోసం జనాలు కొట్టకున్నారు. దీంతో బస్టాండ్‌లో ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రయాణికులు మాట్లాడుతూ ప్రభుత్వం సరిపడా బస్సులను ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు బస్సుల కొరతతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ఈ విషయం స్పందించి సరిపడా బస్సులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.