వినేశ్ ఫొగాట్ అనర్హత పై సీఏఎస్ సింగిల్ లైన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చింది. ఈ తీర్పుపై వినేశ్ తరుపు లాయర్ సిఘానియా స్పందించారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వినేశ్ ఫొగాట్ అనర్హత పై సీఏఎస్ సింగిల్ లైన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చింది. ఈ తీర్పుపై వినేశ్ తరుపు లాయర్ సిఘానియా స్పందించారు. ఈ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు లేదా రోజుల్లో రావచ్చని ఇండియన్ ఒలంపిక్స్ అసోసియేషన్ న్యాయవాది వదుష్ఫత్ సింఘానియా అన్నారు. పారిస్ ఒలంపిక్స్ లో 50 కేజీల విభాగంలో ఫైనల్లో తనపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో రజతం ఇవ్వాలంటూ వినేశ్ పొగాట్ కేస్ ఫైల్ చేశారు. దీని పై సింగిల్ లైన్ ఆర్డర్ ను మాత్రమే జారీ చేసిందన్నారు. పొగాట్ అప్పీల్ ను కొట్టివేయడం చాలా అన్యాయం అంటున్నారు నెటిజన్లు.
అయితే సింఘానియా మాత్రం అప్పీల్ ను కొట్టివేయడం పై సీఏఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదన్నారు. ఈ నిర్ణయం పై రోజుల్లో స్వీస్ ఫెడరల్ ట్రైబ్యునల్ లో అప్పీల్ చేసుకునే వెసులు బాటు ఉందన్నారు. ఈ అప్పీల్ కొట్టేస్తున్నట్లు సింగిల్ లైన్ ఆర్డర్ మాత్రమే వచ్చింది. పూర్తి స్థాయి . అప్పీల్ తిరస్కరణపై వివరణతో కూడిన ఆదేశాలు పదిపదిహేను రోజుల్లో వస్తాయని భావిస్తున్నాం. సీఏఎస్ నిర్ణయంపై 30 రోజుల్లోపు స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసుకోవచ్చు. సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే మాతోనే ఉన్నారు. ఆయన సూచనలతో ముందుకు సాగుతామన్నారు.