బీజేపీ కుట్ర పూరితంగా కవితను నిర్బంధించిందని జాగృతి విద్యార్థులు ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని సుప్రీం నిర్ధారించిందని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేసిన బీజేపీ కావాలనే కవితను జైల్లో వేయించిందని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: BRS ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై తెలంగాణవ్యాప్తంగా సంబురాలు జరుపుకుంటున్నారు. లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లోనే ఉన్న విషయం తెలిసిందే. గురువారం ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సెక్షన్ 45 ప్రకారం జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈరోజు తుది విచారణ జరిపింది. శుక్రవారం మధ్యాహ్నం కవిత హైదరాబాద్ కు రానున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న BRS ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఓయూ జాగృతి విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు. టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. బీజేపీ కుట్ర పూరితంగా కవితను నిర్బంధించిందని జాగృతి విద్యార్థులు ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవని సుప్రీం నిర్ధారించిందని అన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేసిన బీజేపీ కావాలనే కవితను జైల్లో వేయించిందని అన్నారు. లిక్కర్ పాలసీని లిక్కర్ స్కాం అని చెప్తూ కవితను 164 రోజులు జైల్లో ఉంచారని అన్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని.. అందుకే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు.