ఈ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో NIA అధికారులు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. డార్క్‌వెబ్ ద్వారా నిందితులు పరిచయాలు పెంచుకున్నట్లు ఆధారాలు లభించాయని అధికారులు వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పోలీసులు పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. పేలుడు ఘటనలో ఇప్పటికే ఐసిస్ ఆల్ హింద్ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులపై అభియోగాలు ఉన్నాయి. ముసవిర్, మతీన్, మునీర్, షరీఫ్‌లపై NIA అభియోగాలు వేసిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో NIA అధికారులు పలు కీలక విషయాలను ప్రస్తావించారు. డార్క్‌వెబ్ ద్వారా నిందితులు పరిచయాలు పెంచుకున్నట్లు ఆధారాలు లభించాయని అధికారులు వెల్లడించారు.
ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్‌తో కలిపి కుట్రలు జరిపారని తెలిపారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజునే పేలుళ్లు జరపడానికి ఉగ్రవాదులు కుట్ర చేశారని వెల్లడించారు. బెంగళూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసేందుకు కుట్ర జరిగిందని NIA అధికారుల దర్యాప్తులో తేలింది. దేశంలోని పలు చోట్ల దాడులు చేయడానికి కుట్ర నిందితులు ప్లాన్ చేసినట్లు సమాచారం. టెలీగ్రామ్ యాప్ ద్వారా టచ్‌లో ఉండి దాడులకు ప్లాన్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
.