కన్నడ థియేటర్లో భారీ కలక్షన్లు తెచ్చుకున్న మూవీ..అసలు ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్ లోకి వచ్చేసింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ వారం ఓటీటీ లో ఫ్యామిలీ డ్రామాస్ చాలా వస్తున్నాయి. ఆ లిస్ట్ లో ఇప్పుడు చిల్లీ చికెన్ కూడా యాడ్ అయ్యింది. ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా ఓటీటీ లోకి కొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. ఈ వారం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ స్ట్రీమింగ్ అయిపోతుంది. ఇది రియాల్ స్టోరీ ఆధారంగా తీసిన కన్నడ సినిమా . కన్నడ థియేటర్లో భారీ కలక్షన్లు తెచ్చుకున్న మూవీ..అసలు ఏ హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్ లోకి వచ్చేసింది.
బెంగళూరులో జరిగిన కొన్ని నిజ జీవిత ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకొని ఈ సినిమా రూపొందించారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది కాని చాలా మంచి పాజిటివ్ టాక్ తో థియేటర్లో ఆడింది. మూవీ డేటా బేస్ లో 8.5 రేటింగ్ వచ్చిన సినిమా. ఈ సినిమా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా కన్నడలో మాత్రమే అందుబాటులో ఉంది. అతి త్వరలో తెలుగు , తమిళ్ లోకి కూడా వచ్చే అవకాశం ఉంది.
ఏకంగా డిష్ పేరునే మూవీ టైటిల్ గా పెట్టి తీయడం వలన సినిమాపైన అందరికి కాస్త క్యూరియాసిటీ పెరిగింది.ఈ సినిమా అంతా నూడుల్ హోమ్ అనే రెస్టారెంట్ ను నడిపించే ఆదర్శ్ అనే యువకుడు. అతని దగ్గర పనిచేసే నలుగురు నార్త్ ఈస్ట్ కుర్రాళ్ల చుట్టు ఈ కథ నడుస్తుంది. వీరి జీవితం అంతా పనంగా పెట్టి రెస్టారెంట్ ను డవలప్ చేయడానికి చూస్తుంటారు. కాని కథ ట్విస్ట్ ఇక్కడే ....ఇంతలో ఆ నలుగురిలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా చనిపోతాడు.ఆ తర్వాత ఏం జరిగింది ? అతనిని హత్య చేసింది ఎవరు? ఆ తర్వాత వారి జీవితాలలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంది ? ఈ మూవీ కథకు టైటిల్ కు సంబంధం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.