విద్యుత్ వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగింత పై ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఓల్డ్ సిటీ (సెంట్రల్ జోన్) విద్యుత్ ఉద్యోగుల జేఏసీ గురువారం ధర్నాకు దిగారు.
న్యూస్ లైన్ డెస్క్: విద్యుత్ వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగింత పై ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఓల్డ్ సిటీ (సెంట్రల్ జోన్) విద్యుత్ ఉద్యోగుల జేఏసీ గురువారం ధర్నాకు దిగారు. ఆదానీ కంపెనీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జరిగిన ఒప్పందం ఏంటి? ఒప్పందాలు బయట పెట్టాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. దవోస్ & ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రి, ఆదాని కంపనీ ప్రతినిధుల మధ్య భేటి రహస్యం ఏంటో బయట పెట్టాలని నిరసన తెలిపారు. ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరం చేయడం ఏంటాని మండిపడ్డారు. ఎస్పీడిసిఎల్, ఎన్‌పిడిసిఎల్, ట్రాన్స్ కో, జెన్కో సంస్థలను ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం దారుణమని ఈ నిర్ణయాని వారు తీవ్రంగా ఖండించారు. 4 కోట్ల ప్రజల ఆస్తిని ఆదానికి, అంబానీకి ఇస్తామంటే 55 వేల మంది విద్యుత్ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ చూస్తూ ఉరుకొమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మా ఉద్యోగులను ఏం చేస్తారు, మా ఉద్యోగులకు రక్షణ లేదని వాపోయారు. ప్రభుత్వ సంస్థ లను ప్రైవేట్ చేస్తే పోరాటాలకు కూడా తము సిద్ధం అని స్పష్టం చేశారు. మీ రాజకీయాలు ఉంటే పక్కన పెట్టుకోండి, కానీ విద్యుత్ సంస్థలను ప్రైవేట్ చేయడం సరికాదని ప్రభుత్వాన్నికి వేడుకున్నారు.