Cm Revanth: రహదారుల ప్రాజెక్ట్ స్టేటస్ పై సీఎం సమీక్ష

జాతీయ రహదారుల విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రస్తావించిన అంశాలపై తక్షణం స్పందించిన సీఎం బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720609744_cmmeet.jfif

న్యూస్ లైన్ డెస్క్: జాతీయ రహదారుల విషయంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రస్తావించిన అంశాలపై తక్షణం స్పందించిన సీఎం బుధవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి వాటి పురోగతి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారులు నిర్మాణంలో ఉన్న పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలను ఆరా తీశారు. రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శాశ్వతంగా భూములు కోల్పోవాల్సి వస్తున్నందున వారికి పరిహారం గరిష్టస్థాయిలో ఉండే విధంగా చూడాలని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న వివిధ సమస్యలపై దృష్టి సారించి తక్షణం వాటిని పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలతో పాటు ప్రతిపాదనలను సమర్పించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్ర రీజినల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల – వరంగల్ – ఖమ్మం – విజయవాడ కారిడార్ భూ సేకరణ పురోగతిపై అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్స్ మెంబర్ అనిల్ చౌదరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy meet

Related Articles