Cm Revanth: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానం

కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రానిది తెలంగాణపై వివక్ష కాదు, కక్ష అన్నారు.


Published Jul 24, 2024 07:35:37 AM
postImages/2024-07-24/1721823707_budget.png

న్యూస్ లైన్ డెస్క్: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రానిది తెలంగాణపై వివక్ష కాదు, కక్ష అన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూపాయి చెల్లిస్తే.. 45 పైసలు కూడా తిరిగి ఇస్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే బీహార్‌, ఆంధ్రప్రదేశ్ రూపాయి చెల్లిస్తే కేంద్రం తిరిగి రూ.7 ఇస్తోందని సీఎం రేవంత్‌ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించిందని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ శాసనసభ తీవ్ర అసంతృప్తి నిరసన తెలియజేస్తోందన్నారు.

ప్రస్తుతం బడ్జెట్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. తెలంగాణ నుంచి 3లక్షల కోట్లకుపైగా పన్నుల రూపంలో ఇస్తే కేంద్రం రాష్ట్రానికి ఇచ్చేది 1లక్షా 68వేల కోట్లు మాత్రమే అన్నారు. మన హక్కులు మనకు ఇవ్వకపోవడం వల్లే ఈ అంశంపై సభలో చర్చించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అయిదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్నది ఎంత అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లిస్తున్నది రూ.22లక్షల 26 వేల కోట్లు అయితే కేంద్రం ఐదు రాష్ట్రాలకు తిరిగి ఇచ్చేది రూ.6లక్షల 42వేల కోట్లు మాత్రమే అని తెలిపారు. 

యూపీ పన్నుల రూపంలో కేంద్రానికి ఇచ్చేది రూ.3 లక్షల 41వేల కోట్లు మాత్రమే, కానీ యూపీకి కేంద్రం తిరిగి ఇచ్చేది రూ.6 లక్షల 91వేల కోట్లు అన్నారు. ఐదు రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే యూపీకి చెల్లించేది ఎక్కువ ఇదీ కేంద్రం వివక్ష అన్నారు. దేశం 5ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చేశామని అన్నారు.

మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరాం. ఐఐఎం, సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రాలకు న్యాయంగా దకాల్సిన వాటా దక్కడంలేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆఖరు నిముషం వరకు ప్రయత్నం చేస్తామని అన్నారు. తెలంగాణ హక్కులకు భంగం కలిగించినందుకు, నిధుల కేటాయింపులో జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy assembly unionbudget

Related Articles