Cm: నకిలీ విత్తనాల పై సీఎం రేవంత్ నజర్

నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రడ్డి ఆదేశించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-16/1721141873_gm420.jfif

న్యూస్ లైన్ డెస్క్: నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీల పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగర శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని, మానవ అక్రమ రవాణా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో పీస్ కమిటీలను పునరుద్దరించాలని, అలాగే బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి, క్రిమినల్స్ తో కాదని స్పష్టం చేశారు. డ్రంకన్ డ్రైవ్ తో పాటు డ్రైవ్ ఆన్ డ్రగ్స్ కూడా ఉండాలని, హైదరాబాద్ నగరంలో రాత్రి పూట ఫుడ్ కోర్ట్ ల విషయంలో ఇబ్బంది రానివ్వొద్దని చెప్పారు. డ్రగ్స్ నియంత్రణ పైన పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలని, డ్రగ్స్ విక్రయిస్తున్న విదేశీయులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని, ఎవరో చెబితే కలెక్టర్లు, ఎస్పీలకు పోస్టింగ్ లు ఇవ్వలేదని సమర్థత ఆధారంగా నిర్ణయం తీసుకున్నాని తెలిపారు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఫిజికల్ పోలీసింగ్ నిర్వహించాలని, కలెక్టర్లు తప్పని సరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనాని సీఎం పేర్కొన్నారు. రైతు రుణమాఫీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం అన్నారు. రుణమాఫీ అమలు పైన కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దని అధికారులకు సూచించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy ias-officer

Related Articles