Cm: ఆగష్టులో పంచాయతీ ఎన్నికలు

ముఖ్యమంత్రి రేవంత్ రడ్డి పంచాయితీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు.


Published Jul 26, 2024 09:12:53 AM
postImages/2024-07-26/1721997218_panchayat.PNG

న్యూస్ లైన్ డెస్క్: స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించ‌డానికి ఉన్న ఆటంకాలు ఏమిట‌ని సీఎం ప్ర‌శ్నించారు. భార‌త ఎన్నిక‌ల సంఘం (ఈసీఐ) నుంచి రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి (ఎస్ఈసీ) నూత‌న ఓట‌ర్ల జాబితా రావాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. అందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంద‌ని సీఎం రేవంత్ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల‌కు ఈసీఐ జాబితా పంపింద‌ని, మ‌న‌తో పాటు మ‌రో ఆరు రాష్ట్రాల‌కు మ‌రో వారంలో జాబితాలు పంపిస్తుంద‌ని అధికారులు స‌మాధాన‌మిచ్చారు. 

జాబితా రాగానే వెంట‌నే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. వారంలోపే ఆయా స్థానిక సంస్థ‌ల‌కు త‌గిన‌ట్లు ఓట్ల‌ర్ల జాబితాలు రూపొందించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి బీసీ క‌మిష‌న్ సైతం నిర్దిష్ట గ‌డువులోగా త‌మ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీమంత్రి జానారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణ మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy meet

Related Articles