గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా)పై విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
న్యూస్ లైన్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విపత్తుల నిర్వహణ విభాగాన్ని విస్తృతం చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా)పై విధి విధానాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. హైడ్రా విధివిధానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ జరిపారు. జోన్ విభజనలో భాగంగా పోలీస్ స్టేషన్ పరిమితులు, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను పూర్తిగా ఒక జోన్‌లో చేర్చారు. అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయించడాన్ని పరిశీలించాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అనధికార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించి జరిమానాలు వసూలు చేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. కాలువలు, సరస్సులు, ప్రభుత్వ భూములపై ఆక్రమణలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలను రూపొందించడానికి అధ్యయనం చేయాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల నాటికి సమగ్ర విధానాలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.