Cm: నేత కార్మికులకు ఉపాధి కల్పించాలి

హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.


Published Jul 26, 2024 11:00:49 AM
postImages/2024-07-26/1722009627_job2.PNG

న్యూస్ లైన్ డెస్క్: హ్యాండ్లూమ్స్, పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, TGCO ఎండీ శైలజ రామయ్యర్, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆగస్టు 15 తర్వాత అన్ని విభాగాల్లో యూనిఫామ్ ప్రోక్యూర్ చేసే వారితో సమావేశం నిర్వహించే ఏర్పాట్లు చేయాలన్నారు.

 ఆర్టీసీ, పోలీస్, హెల్త్ విభాగాల్లోనూ ప్రభుత్వ సంస్థల నుంచే క్లాత్ ప్రోక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. తద్వారా కార్మికులకు మరింత ఉపాధి కలుగుతుందన్నారు. మహిళా శక్తి గ్రూప్ సభ్యులకు బెస్ట్ క్వాలిటీతో డ్రెస్ కోడ్ కోసం ప్రత్యేక డిజైన్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. నిజమైన కార్మికుడికి లబ్ది చేకూరేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana congress minister cm-revanth-reddy

Related Articles