DEEPIKA : దీపికా చీర ఎందుకంత ప్రత్యేకం..?

అక్కడ దీపిక గ్రీన్ బెనారసీ చీర లో తన భర్తతో చాలా సింపుల్ గా ఎలాంటి హంగులు లేకుండా కనిపించారు.


Published Sep 07, 2024 07:57:00 PM
postImages/2024-09-07/1725719394_254.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ప్రెగ్నెన్సీ మొదటి నుంచి దీపిక ..చాలా హెల్దీ గా తన పనులు తను చేసుకుంటూ ..చాలా కామన్ గా తిరుగుతుంది. సో కాల్డ్ యాక్టర్స్ లా కాకుండా పధ్ధతిగా ..తన హద్దుల్లో తను ఉంటూ తన మథర్ హుడ్ ను తను ఎంజాయ్ చేస్తుంది. చాలా ఫిట్ గా ఉంది...చాలా అందంగా కూడా ఉంది. ఈ రోజు దీపిక ముంబై లోని సిధ్ది వినాయక టెంపుల్  దర్శనానికి వెళ్లారు. అక్కడ దీపిక గ్రీన్ బెనారసీ చీర లో తన భర్తతో చాలా సింపుల్ గా ఎలాంటి హంగులు లేకుండా కనిపించారు.


ఇక దీపిక అందరి కళ్లు దీపిక మీదే.. ఎలా ఉంది...ఎలా నడుస్తుంది. ఏ చీర కట్టుకుంది. చీర రేటెంత. చీరకు ప్రత్యేకత ఏంటి అవే మాటలు . ఈ చీరను ప్రముఖ డిజైనర్ ఒకరు త్వరలో తల్లి కాబోతున్న దీపికకు బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ చీర నేయడానికే ఆరు నెలల సమయం పట్టిందట. ప్యూర్ బెనారసీ పట్టు చీరలో సింపుల్ గా కనిపించారు దీపిక. ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా ఈ చీరను బనారసి బైఠక్ బ్రాండ్ నుండి నటికి బహుమతిగా అందించారు.


దీపికా పదుకొణె ధరించిన ఆకుపచ్చ బనారస్ చీర గురించి "బనారసి బైఠక్"  కొన్ని విషయాలను వెల్లడించింది. వందేళ్లకు  పూర్వం ఉన్న ఆకుపచ్చ బనారస్ చీరకు కాపీగా తీసుకుని.. ఈ చీర తయారు చేసినట్టు వెల్లడించారు. ఆకుపచ్చ సంతనానికి , అభివృధ్ధికి , మంచి పాజిటివ్ వైబ్ ఇస్తుందని అందుకే దీపికకు బహుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇలాంటి టైంలో కాస్త పాజిటివ్ వైబ్స్ ప్రతి గర్భిణి కి అవసరమే అంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : deepika-padukone newslinetelugu mumbai

Related Articles