వైఎస్సార్ జయంతి వేడుకలు.. నివాళులర్పించిన సీఎం

దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకొని  సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పంజాగుట్ట చౌరస్తాలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-08/1720431019_revanth1.jfif

న్యూస్ లైన్ డెస్క్: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పురస్కరించుకొని  సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పంజాగుట్ట చౌరస్తాలోని రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన  వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎగ్జిబిషన్2ను సందర్శించారు. ప్రదర్శనలో రాజశేఖర్ రెడ్డి చిన్ననాటి చిత్రాలతో పాటు రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన ఘటనలు తెలియజేసేలా ఫోటోలు ఏర్పాటు చేయగా వాటిని అందరూ ఆసక్తిగా తిలకించారు. ఆ తరువాత  గాంధీభవన్లో జరిగిన రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మధుయాష్కి గౌడ్ కలిసి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును సందర్శించారు. అనంతరం మైనారిటీ సెల్ నాయకులు నిర్వహించిన జయంతి వేడుకల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి  ప్రవేశన సంక్షేమ పథకాలు తెలుగు ప్రజల మనసుల్లో స్థాయిగా నిలిచిపోయాయి అన్నారు. పార్టీని బలోపేతం చేయడంలోనూ, అవసరమైన సంక్షేమ పథకాలను అందించడం ద్వారా ప్రజల మన్ననలను పొంది, మహానేతగా ఎదిగారన్నారు. క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఆయన ఆశలను కొనసాగిద్దామని పేర్కొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy

Related Articles