Cm Revanth: ఖమ్మం కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లో వదర బాధితు ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.


Published Sep 02, 2024 08:37:12 PM
postImages/2024-09-02/1725289632_fulka.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం కలెక్టరేట్‌లో వదర బాధితు ప్రారంభమైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయిందని ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాన్నికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని, వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించామని, భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాయం కోరామని తెలిపారు. తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని సీఎం తెలిపారు. వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం జరిగిందని, తెలంగాణలో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేసినట్లు ఆయన అన్నారు.

వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు ఇస్తున్నామని, తక్షణ అవసరాల కోసం జిల్లాల కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేశామన్నారు. రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశామని, ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన చర్యలు తీసుకోవాలని వరద సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలని సీఎం రేవంత్ అన్నారు. ప్రజలకు ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని, వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలని సీఎం రేవంత్ కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy congress-government meet khammam-floods

Related Articles