Cm Revanth: ఖమ్మం జిల్లాకే అన్ని నిధులు కేటాయించాం

ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం ఒక రకంగా సంతోషం.. ఇంకో రకంగా ఒత్తిడిగా ఉందన్నారు.


Published Aug 15, 2024 05:24:33 AM
postImages/2024-08-15/1723717396_khammam.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సీతారామ లిఫ్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్నందుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం ఒక రకంగా సంతోషం.. ఇంకో రకంగా ఒత్తిడిగా ఉందన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాకే అన్ని నిధులు కేటాయిస్తున్నారంటు మిగిలిన జిల్లాల నుంచి ఒత్తిడి ఉందన్నారు. ప్రభుత్వం ఖమ్మం జిల్లాకే ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రి వర్గం అంత ఖమ్మం లోనే ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాకే అప్పజెప్పామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినప్పటికి ఖమ్మం ప్రాజెక్టులకు నిధులు ఇస్తున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాజెక్టులు పూర్తి చేయాలని ముందుకు వచ్చామన్నారు. 10 యేళ్లు అధికారంలో ఉండి కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపైన లక్షా ఎనభై వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. 

ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను ఇస్తే.. క్రిష్ణా జలాలపైన ఆధారపడే అవసరం ఉండదని తుమ్మల చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి రెండు వారాలకు ఒక సారి ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష చేశారన్నారు. మంత్రి తుమ్మల మాటను నమ్మి రైతులు ప్రాజెక్టుల కోసం భూములు ఇచ్చారని అన్నారు. నాయకులతో పాటు రైతులు కూడా ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీకి ఏడు మండలాలు ఇవ్వడంతో ఇందిరాసాగర్ ఏపీకి పోయిందని సీఎం రేవంత్ అన్నారు. 

newsline-whatsapp-channel
Tags : india-people cm-revanth-reddy sitarama-project tummalanageswararao

Related Articles