ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
న్యూస్ లైన్ డెస్క్: హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 28 వేల మంది విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. కొడంగల్‌లో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో ఇప్పటికే సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.
హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ CSR ఫండ్స్‌తో నిర్వహించే ఈ కార్యక్రమంపై ఫౌండేషన్ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం సూచించారు.