మెగా ఫ్యామిలీ అంటే మనకు అందరూ స్టార్ హీరోలే గుర్తుకొస్తారు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి అందరూ అబ్బాయిలే ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ అమ్మాయిలు ఎవరు కూడా ఇండస్ట్రీలోకి
న్యూస్ లైన్ డెస్క్: మెగా ఫ్యామిలీ అంటే మనకు అందరూ స్టార్ హీరోలే గుర్తుకొస్తారు. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి అందరూ అబ్బాయిలే ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ అమ్మాయిలు ఎవరు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేకపోయారు. కానీ నాగబాబు కూతురు నిహారిక మాత్రం యాంకర్ గా ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొని పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. కానీ ఆమెకు చేసిన సినిమాలు అంతగా కలిసి రాకపోవడంతో నటనా రంగానికి పుల్ స్టాప్ పెట్టి తన సొంత కాళ్లపై ఏదో ఒక విధంగా ఇండస్ట్రీలో ఎదగాలని ట్రై చేస్తోంది.
ఇదే తరుణంలో నటనరంగంలో కాకుండా ఆమె నిర్మాతగా రాణించాలని భావిస్తోందట. నిర్మాతగా రాణించాలి అంటే తప్పనిసరిగా కొన్ని సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చేపట్టాలి. అలా చిన్న చిన్న వెబ్ సిరీస్ ల ద్వారా నిర్మాణ బాధ్యతలు చేపడుతూ ఓ మోస్తారుగా దూసుకుపోతోంది నిహారిక. అలాంటి ఈ మెగా బ్యూటీ తాజాగా "కమిటీ కుర్రోళ్ళు" అనే చిత్రానికి ప్రొడ్యూసర్ గా పనిచేసింది. అయితే ఈమె తీసుకువచ్చిన మొదటి చిత్రమే అద్భుతమైన హిట్స్ సాధించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఆమె చాలామంది కొత్త నటినటులను పరిచయం చేసిందట. అలాంటి ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన విడుదలైంది. మరి ఇది బాక్సఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబట్టింది అనే వివరాలు చూద్దాం. పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై వచ్చిన మూవీ కమిటీ కుర్రోళ్ళు. 90వ దశకంలో గోదావరి జిల్లాలో అందమైన పచ్చని పంట పొలాల మధ్య చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా చూస్తే అలనాటి రోజులు గుర్తుకు వస్తాయి.
అయితే ఈ మూవీ అన్ని వర్గాల ఆడియోన్స్ మెప్పించి మొదటి వారంలో 1.63 కోట్ల రూపాయల వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించిన యాదు వంశీకి కూడా మంచి పేరు వచ్చింది. ఆయన ఈ చిత్రం ద్వారా నేటి తరం యువతకు స్నేహబంధం అంటే, దాని విలువ ఏంటో చూపించాడు. ఇక అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి కొణిదెల నిహారికకు మాత్రం నిర్మాణ రంగంలో మంచి ప్రారంభాన్ని అందించింది అని చెప్పవచ్చు.