రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అద్వాన్నంగా మారిపోతున్నాయి. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయి. కరెంటు కోతలతో ఇటీవల పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా అక్కడ వ్యవస్థలో మాత్రం మార్పు రావడంలేదు. " />
Warangal MGM: వరంగల్ ఎంజీఎంలో ఇంత నిర్లక్ష్యమా..! 2024-06-30 14:06:07

న్యూస్‌లైన్, వరంగల్ : రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ అద్వాన్నంగా మారిపోతున్నాయి. ఇప్పటికే వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో కరెంటు కోతలు తీవ్రంగా ఉన్నాయి. కరెంటు కోతలతో ఇటీవల పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా అక్కడ వ్యవస్థలో మాత్రం మార్పు రావడంలేదు. అక్కడి సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకునేవాళ్లు కాదు కదా కనీసం చూసేవాళ్లు కూడా లేకుండాపోయారు. హాస్పిటల్ లోని సమస్యలపై రోగులు ఫిర్యాదులు చేస్తున్నారు. అక్కడ ఉన్న ఫిర్యాదుల బాక్స్ లో వేస్తున్నారు. అయితే అదీ ఇప్పుడు నిండిపోయినా దానిని పట్టించుకునేవాళ్లు కూడా కరువయ్యారు. దీంతో పేషెంట్స్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుల బాక్స్ నిండిపోయినా ఎవరూ పట్టించుకోరా అంటూ మండిపడ్డుతున్నారు. ఫిర్యాదుల బాక్స్ నిండి అని కూడా ఫిర్యాదులు చేయాలా అంటూ నిలదీస్తున్నారు. నిత్యం పేషెంట్ల బాధలు తీర్చాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

రంగల్ జిల్లాలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కార్యక్రమానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉన్న ఎంజీఎం హాస్పిటల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదని జనం మండిపడుతున్నారు. వరంగల్ ఎంజీఎం సమస్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నా కనీసం అటూ వైపు కూడా ఎందుకు రాలేదంటున్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ పై అంత చిన్నచూపు ఎందుకని నిలదీస్తున్నారు. అటూ అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పట్టణంలో ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటిస్తున్నా కనీసం ఈ ఫిర్యాదుల బాక్స్ కూడా పట్టించుకోకపోవడమే అధికారుల పనితీరుకు నిదర్శనమంటున్నారు.