న్యూస్ లైన్ డెస్క్ : ఖమ్మంలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ మాజీ మంత్రులపై కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పొంగి పొర్లడంతో వరదల్లో మునిగిపోయిన ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, సబితారెడ్డి, జగదీశ్ రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర తదితర బీఆర్ఎస్ నాయకులు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెప్తూ నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతల వాహనాలు.. https://t.co/ejVr1xcrge pic.twitter.com/sM2X0yKtC6 — News Line Telugu (@NewsLineTelugu) September 3, 2024
బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర సరుకులు పంచుతున్న ప్రాంతానికి చేరుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మాజీ మంత్రుల కార్లను ధ్వంసం చేశారు. బాధితులకు పంచుతున్న నిత్యావసర సరుకులను చిందరవందర చేశారు. మీరెవరు మా ప్రాంతంలో నిత్యావసర సరుకులు పంచడానికి అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడికి దిగారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలికి తీవ్రంగా గాయమై.. విరిగింది. బీఆర్ఎస్ నేతల కార్లు ధ్వంసమయ్యాయి.