Congress : రుణమాఫీ వేదికపై కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు

రుణమాఫీ పథకం ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నంత పని చేశారు. గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నసదరు నాయకుడు ఈ మధ్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రుణమాఫీ పథకం కార్యక్రమంలో వేదిక మీద ముందు వరుసలో కూర్చున్నారు. దీంతో.. పదేళ్ల పాటు కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి.. ఇప్పుడు ముందు వరుసలో ఎలా కూర్చున్నావంటూ వాగ్వాదానికి దిగారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721312501_PatanCheruCongress.jpg

న్యూస్ లైన్ డెస్క్ : రుణమాఫీ పథకం ప్రారంభ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నంత పని చేశారు. నిన్ను ఎవడు పిలిచాడు.. ఎందుకు స్టేజీ మీదకు వచ్చావ్ అంటూ సొంత పార్టీ నేతలనే స్టేజీ మీద నుంచి తోసేసేందుకు ప్రయత్నించారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని సోలక్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రుణమాఫీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ ప్రభాకర్ ముందు వరుసలో కూర్చోవడాన్ని కాంగ్రెస్ నాయకులు సహించలేకపోయారు. మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ ప్రభాకర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ హోదాతో ముందు వరుసలో కూర్చున్నావని ప్రశ్నించారు.

గత పదేళ్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రభాకర్ ఈ మధ్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పదేళ్ల పాటు కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేసిన వ్యక్తి.. ఇప్పుడు ముందు వరుసలో ఎలా కూర్చుంటాడంటూ హంగామా చేశారు. దీంతో.. ప్రభాకర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ మధ్యే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జోక్యం చేసుకొని నచ్చజెప్పారు. అంతలోనే సభలో ఖబడ్దార్ కాంగ్రెస్ వ్యతిరేకులారా? అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ మారిన వ్యక్తికి సరైన గుణపాఠం ఎదురైందని బీఆర్ఎస్ వర్గాలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. కాగా.. ఇదే వేదికపై గూడెం మహిపాల్ రెడ్డితో పాటు.. గాలి అనిల్ కుమార్ కూడా ఉన్నారు. వారు తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

 

newsline-whatsapp-channel
Tags : congress-government congress-leader-harassments runamafi

Related Articles