Tripura: త్రిపుర స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కి చావుదెబ్బ

పంచాయితీ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. అయితే, తాజాగా వచ్చిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం సగం స్థానాల్లో కూడా గెలుపొందలేకపోనట్లు తెలుస్తోంది. మొత్తం 334 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీకి అంతంత మాత్రంగానే ఓట్లు పడ్డాయి.


Published Aug 13, 2024 07:07:30 AM
postImages/2024-08-13/1723549812_tripuraelections.jpg

న్యూస్ లైన్ డెస్క్: త్రిపుర స్థానిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కి చావుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. గ్రామ పంచాయితీ. పంచాయితీ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. అయితే, తాజాగా వచ్చిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం సగం స్థానాల్లో కూడా గెలుపొందలేకపోనట్లు తెలుస్తోంది. మొత్తం 334 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీకి అంతంత మాత్రంగానే ఓట్లు పడ్డాయి.

గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 6370 సీట్లు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం 131 స్థానాల్లోనే గెలుపొందింది. పంచాయతీ సమితి ఎన్నికల్లో 423 సీట్లకు గాను హస్తం పార్టీ కేవలం 8 సీట్లనే సొంతం చేసుకుంది. ఇక జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే, కేవలం రెండు స్థానాల్లో మాత్రమే సత్తా చాటుకోగలిగింది. అయితే, మొత్తం 116 స్థానాల్లో ఈ ఎన్నికలను నిర్వహించారు. 

అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలిచిందని తెలుస్తోంది. కానీ, పోలీసులను ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ నేతలు  అనుకూలంగా మార్చుకున్నారని కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఓటర్లపై మాత్రమే కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులపై బీజేపీ నేతలు బెదిరింపులకు పాలపడ్డారని చెబుతున్నారు. 

newsline-whatsapp-channel
Tags : news-line congress tripura-local-elections

Related Articles