బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భేటీ పూర్తి అయింది.
న్యూస్ లైన్ డెస్క్: బేగంపేట టూరిజం ప్లాజాలో నిరుద్యోగులతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భేటీ పూర్తి అయింది. ఈ భేటీలో నిరుద్యోగుల డిమాండ్స్ పై నేతలు చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బల్మూర్ మాట్లాడుతూ నిరుద్యోగులు చెప్పిన సమస్యలు విన్నాము వారి సమస్యలని పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. నిరుద్యోగులు కోరుకునే విధంగా సానుకూలమైన ప్రకటన వచ్చే విధంగా చేస్తామని, ముఖ్యంగా డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షకి మధ్య తక్కువ వ్యవధి ఉంది ఇది కూడా ఉదేశపూర్వకంగా ఇచ్చిన డేట్స్ కాదన్నారు. గతంలో డీఎస్సీ పరీక్షలు మే -జూన్ నెలలో ఉండే అయితే అ రోజు యువకులు మరొకసారి డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని కోరారు అని గుర్తు చేశారు.
నిరుద్యోగుల కోరిక మేరకే ఆ రోజు టెట్ నిర్వహించామని తెలిపారు. అయితే అప్పటికే టీజిపీఎస్సీ పరీక్షలకు డేట్స్ ఇవ్వడంతో డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షలు వారం వ్యవధిలోనే వచ్చాయి. ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి తను, ఎంపీ నిరుద్యోగుల సమస్యలు విన్నారు. ఈ విషయాని సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. గ్రూప్ 2 పరీక్షల పై ఇక సానుకూలమైన ప్రకటన వచ్చేలా చూస్తామన్నారు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంటామని తెలిపారు. ఈసారి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ పేర్కొన్నారు.