భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు నిరాశ ఎదురైంది.
న్యూస్ లైన్ స్పోర్ట్స్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు నిరాశ ఎదురైంది. వినేశ్ ఫోగట్ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది. సిల్వర్ పతకం ఇవ్వాలన్న వినేశ్ అభ్యర్థనను బుధవారం కోర్టు తిరస్కరించింది. పారిస్ ఒలంపిక్స్ లో 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంగా కళ్ల ముందున్న బంగారు పతక కలను చెరిపేసింది. వినేశ్ కోర్టు తీర్పుపై మరో మూడ్రోజులు నిరీక్షించకతప్పదు. వినేశ్ ఫోగాట్ అప్పీల్ పై నిన్న వాయిదా పడింది. తనను అనర్హత వేటుపై బయటకు పంపేసినా కనీసం సిల్వర్ మెడల్ అయినా తనకు రావాలని వినేశ్ ఫొగాట్ అప్పీల్ ఫైల్ చేశారు.
ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 50 కిలోల కేటగిరీలో ఫైనల్ ఆడాల్సిన వినేశ్ ను అధిక బరువు కారణంగా అనర్హురాలిగా ప్రకటించారు. దీంతో వినేశ్ పారిస్ లోని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తాత్కాలిక బెంచ్ ను ఆశ్రయించింది. వినేశ్ తరఫున భారతదేశ ప్రముఖ న్యాయవాదులు హరీశ్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వాదనలు వినిపించారు. కానీ చివరికి వినేశ్ ఫోగట్‌కు నిరాశ తప్పలేదు. దీంతో వినేశ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.