GHMC: అధికారులకు దాన కిషోర్ కీలక ఆదేశాలు

 సీవరేజ్, త్రాగునీరు సరఫరాలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు జీఎం, డీజీఎం, మేనేజర్‌లు, ఇతర సిబ్బంది  క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. 


Published Sep 02, 2024 05:34:02 PM
postImages/2024-09-02/1725278642_danakishorehyd.jpg

న్యూస్ లైన్ డెస్క్: జలమండలి అధికారులకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మాసబ్ ట్యాంక్‌లోని TUFIDC కార్యాలయంలో జలమండలి అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. సీవరేజ్, త్రాగునీరు సరఫరాలో ఎదురయ్యే సమస్యలను దూరం చేసేందుకు జీఎం, డీజీఎం, మేనేజర్‌లు, ఇతర సిబ్బంది  క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. 

నీటిని నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జలమండలి అధికారులు, GHMC అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. వాటర్‌లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 

సాధ్యమైన ప్రాంతాల్లో క్లోరిన్ బిల్లులు పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పని చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్‌ తెరవకుండా చూడాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని దాన కిషోర్ ఆదేశించారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam ghmc

Related Articles