Dengue: డెంగ్యూ వస్తే గుండె జబ్బులు కూడా వస్తాయా ..పరిశోధనలు ఏం చెప్తున్నాయి?

గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 55 శాతం ఎక్కువని ఈ పరిశోధనలో వెల్లడైందంటున్నారు డాక్టర్లు.


Published Sep 08, 2024 09:50:00 PM
postImages/2024-09-08/1725812561_Aedesaegyptifeeding.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: హార్ట్ డిసీజ్ రావడానికి ఇప్పుడు పెద్దగా కారణాలక్కర్లేదు. స్ట్రెస్ అంటున్నారు...నిద్రలేమి ..ఏం వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ గుండెకే. అయితే కోవిడ్-19తో పోలిస్తే డెంగ్యూ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 55 శాతం ఎక్కువని ఈ పరిశోధనలో వెల్లడైందంటున్నారు డాక్టర్లు.


అయితే డెంగ్యూ కారణంగా జ్వరం, ప్లేటెలెట్స్‌ తగ్గడం వంటి సమస్యలు మాత్రమే ఉంటాయని మనకు తెలుసు. ఆ రీజన్ వల్లే గుండె జబ్బులు వస్తాయంటున్నారు డాక్టర్లు. 11,700 మందికి పైగా డెంగ్యూ రోగులు, 12 లక్షల మందికి పైగా కోవిడ్ -19 రోగుల వైద్య డేటాను చూసి ఈ రిపోర్టును రెడీ చేశారు డాక్టర్లు.


నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ మోడలింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లీడ్ రచయిత లిమ్ జు టావో మాట్లాడుతూ కోవిడ్‌ 19 తర్వాత గుండెపోటు కేసులు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కోవిడ్‌ 19 కారణంగా రక్తం గడ్డకట్టడం అది ధమనుల్లో చేరి రక్తప్రసరణకు అడ్డుతగిలి  హార్ట్ అటాక్స్ రావడం కామన్ అయిపోయింది. డెంగ్యూ భవిష్యత్తులో అనేక విధాలుగా శరీరంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. కాలేయం దెబ్బతినడం, మయోకార్డిటిస్, నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : health-news heart-attack heart-problems dengue

Related Articles