Devara: ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించే హీరోయిన్ ఈవిడే.!

ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సినిమా గురించే వినిపిస్తుంది. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వ పోతున్న ఈ సినిమాపై అభిమానులు అనేక అంచనాలు


Published Sep 25, 2024 05:42:30 PM
postImages/2024-09-25/1727266350_devara.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సినిమా గురించే వినిపిస్తుంది. సెప్టెంబర్ 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వ పోతున్న ఈ సినిమాపై అభిమానులు అనేక అంచనాలు  పెట్టుకున్నారు. ఇప్పటికే థియేటర్లు మొత్తం అభిమానుల ఫ్లెక్సీలతో నిండిపోయాయి. అంతేకాదు టికెట్ రేటు పెంచుకోవడానికి రోజుకు ఐదు షోలు వేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అనుమతులు కూడా లభించాయి.  ఇక సినిమా రిలీజ్ అవ్వడమే లేటు రికార్డులు తిరగరాస్తుందని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

ఏది ఏమైనా  జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే దేవర  సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. అలాంటి దేవర చిత్రంలో  ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఇందులో రెండు పాత్రలకు ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, "వర"కు జంటగా జాన్వి  ఉండగా, దేవరాకు జంటగా  శృతి మరాటి నటించిదట.  అయితే ఈమె గుజరాత్ కి చెందిన నటి. ఈ అమ్మడు ఎక్కువగా హిందీ మరాఠీ చిత్రాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందింది. అంతే కాదు బాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకత చాటుకుంది.  అయితే ఈమె గౌరవ్ ఘట్కేసర్ అనే వ్యక్తిని 2016లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం దేవర చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది శృతి మరాఠీ. ఇందులో ఎన్టీఆర్ తండ్రి పాత్రకు భార్యగా నటిస్తుందట.

ఇందులో ఒక ఎన్టీఆర్ కు భార్యగా మరో ఎన్టీఆర్ కు తల్లిగా కనిపిస్తుందట శృతి మరాటి. అయితే ఈమధ్య ప్రమోషన్స్ లో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ దేవర భార్య పాత్రకు ఒక ఫ్రెష్ ఫేస్ కనిపించబోతుందని అందరికీ ఆసక్తి కనబరిచే విషయాన్ని బయటపెట్టారు. దీంతో శృతి మరాఠీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. యాక్టింగ్ ఎలా ఉండబోతుందో చూడాలి అంటే తప్పనిసరిగా దేవర సినిమా చూడాల్సిందే.

https://www.instagram.com/p/DAKol5zShTL/?igsh=MXMydjhqanRuZjJoOA==

newsline-whatsapp-channel
Tags : news-line jr-ntr devara johnvi-kapoor saif-alikhan sruthi-marati

Related Articles