ఈ పరీక్షలు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఉండడంతో తమ మీద ఒక 100 టన్నుల ఒత్తిడి పెడుతున్నట్లే ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యుల్ వెంటనే రద్దు చేసి ప్రతి పరీక్షకు మూడు నెలలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని డిమాండ్ చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్(congress) ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్(job calendar) రిలీజ్ చేస్తామన్న హామీని కూడా అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్(Mahbubnagar) జిల్లా కేంద్రంలో నిరుద్యోగులు నిరసనలు తెలిపారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జూన్ 8న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించారు. అయితే, జూన్ 24 నుండి 30వ తారీఖు వరకు హాస్టల్ వెల్ఫేర్(hostel welfare) పరీక్ష ఉంది. అంతేకాకుండా అదే రోజున డీఈఓ ఎగ్జామ్(DEO exam) నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 5న డీఎస్సీ(DSC) పరీక్ష అయిపోతే, 7న గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి ఉండడంతో తమ మీద ఒక 100 టన్నుల ఒత్తిడి పెడుతున్నట్లే ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ షెడ్యుల్ వెంటనే రద్దు చేసి ప్రతి పరీక్షకు మూడు నెలలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని డిమాండ్ చేశారు.